Friday, March 29, 2024
Homeసినిమావిరాట్ రాజ్ హీరోగా ‘సీతామనోహర శ్రీరాఘవ’ ప్రారంభం

విరాట్ రాజ్ హీరోగా ‘సీతామనోహర శ్రీరాఘవ’ ప్రారంభం

వెండితెరకు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అలనాటి నటుడు హరనాథ్ తమ్ముని మనవడు విరాట్ రాజ్ హీరోగా రూపొందుతున్న ‘సీతామనోహర శ్రీరాఘవ’ నేడు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, ఆత్మీయులు సమక్షంలో వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ నిచ్చారు. యువ హీరో ఆకాష్ పూరి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామల తదితరులు విరాట్ రాజ్ కు ఆశీస్సులు అందించి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలియ జేశారు.

“తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్ స్ఫూర్తితో ఈ ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను” అన్నారు విరాట్ రాజ్

ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతోన్న దుర్గా శ్రీ వత్స కె. మాట్లాడుతూ “ఈ చిత్రం మాస్ ఎంటర్ టైనర్. హీరోగా విరాట్ రాజ్ దర్శకుడిగా నేనూ ఇదే సినిమాతో పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఒక ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ చిత్రం ద్వారా భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్ ను విరాట్ స్వంతం చేసుకునేలా కథను తయారు చేశాం. ‘సీతామనోహర శ్రీరాఘవ’ పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నాం. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భావోద్వేగాల సమ్మిళితం” అన్నారు.

“కె.జి.ఎఫ్.2, సలార్ చిత్రాలకు సంగీతం సమకూరుస్తోన్న రవి బస్ రుర్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. అలాగే త్రిబుల్ ఆర్ చిత్రానికి పోరాటాలు సమకూర్చిన కింగ్ సాలమన్ కంపోజ్ చేస్తున్న పోరాటాలు చిత్రానికి మరో ఆకర్షణ. నిర్మాత సుధాకర్ గారు హీరో కుటుంబానికి సన్నిహిత మిత్రులు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి విజయవంతమైన చిత్రంగా దీనిని మలచటానికి కృషి చేస్తాను. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్