Monday, June 15, 2026
Homeసినిమారామ్ 'స్కంద' నుండి నీ 'చుట్టూ చుట్టూ' సాంగ్ ప్రోమో రిలీజ్!

రామ్ ‘స్కంద’ నుండి నీ ‘చుట్టూ చుట్టూ’ సాంగ్ ప్రోమో రిలీజ్!

ఉస్తాద్ రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న’స్కంద’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో బోయపాటి శ్రీను చూపిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ నీ చుట్టు చుట్టు… ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ డ్యాన్స్ నంబర్ ఫుల్ లిరికల్ వీడియో గురువారం ఉదయం 9:26 గంటలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రామ్ మందపాటి గడ్డంతో మాస్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల మెరిసే వేషధారణలో గ్లామర్‌గా కనిపిస్తుంది.

ప్రోమో చేస్తే ఇది ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ గా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఎస్‌ఎస్ థమన్ ఈ సినిమా కోసం రాకింగ్ ఆల్బమ్ చేసినట్లు తెలుస్తోంది.  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా స్కంద సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular