Tuesday, April 16, 2024
Homeసినిమాఅశ్విన్ బాబు ‘వచ్చినవాడు గౌతం‘ ఫస్ట్ లుక్ విడుదల..

అశ్విన్ బాబు ‘వచ్చినవాడు గౌతం‘ ఫస్ట్ లుక్ విడుదల..

హీరో అశ్విన్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్టును ప్రకటించారు. అశ్విన్ బాబు 8వ చిత్రంగా తెరకెక్కనున్న ‘వచ్చినవాడు గౌతం’ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీకి మామిడాల ఎంఆర్ కృష్ణ దర్సకత్వం వహించనున్నారు. సోమవారం అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. మెడికో థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

షణ్ముఖ పిక్చర్స్‌పై ఆలూరి సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆలూరి హర్షవర్ధన్ చౌదరి సమర్పిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె నాయుడు కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్