అమెరికాలో హిమపాతం… భారీగా విమానాలు రద్దు

అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేని హిమపాతం పడుతోంది. భారీగా పడుతున్న మంచుతో ప్రజలు ఇల్లు ధాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్, పశ్చిమ వర్జీనియా, మిన్నెసోటా ప్రాంతాల్లో మంచు ఎక్కువగా పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆరడుగుల మేర మంచు పెరుకుపోవటంతో రహదారులు మీద వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో రహదారుల మీద వాహనాల రాకపోకలపై అధికారులు నిషేధం విధించారు. మంచులో కూరుకుపోయిన వాహనాలను అత్యవసర బృందాలు బయటకు తీస్తున్నాయి. ఏకధాటిగా పడుతున్న మంచుతో చాల ప్రాంతాల్లో ఇల్లు, రోడ్లు, మైదానాలు, చెట్లు ఇలా అన్ని ధవళ వర్ణం సంతరించుకున్నాయి.

క్రిస్మస్ సెలవులకు ముందు ప్రతికూల వాతావరణం అమెరికా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. మంచు, వాన, గాలి, శీతల ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యమంతటా విమాన సర్వీసులతోపాటు బస్సు, టామ్‌ట్రాక్ ప్యాసింజర్ రైలు వంటి ప్రజారవాణా సేవలకు అంతరాయం కలుగుతున్నది. భారీగా మంచు కురుస్తుండటంతోపాటు ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి పడిపోవడంతో దేశవ్యాప్తంగా 2270కి పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో గురువారం సాయంత్రం 6 గంటల వరకు (స్థానిక కాలమానం ప్రకారం) 2,270 విమానాలను ఆయా విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ముందస్తుగా శుక్రవారం సుమారు 1,000 విమానాలను క్యాన్సల్ అయ్యాయి. శనివారం మరో 85 విమానాలను రద్దు చేశారు. కాగా, గురువారం 7400కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. వాటిలో అత్యధికంగా చికాగో, డెన్వర్‌ నుంచి వచ్చి, పోయే విమానాలే పావు వంతు ఉన్నాయి. అమెరికాలో ఎక్కువగా ఈ రెండు విమానాశ్రయాల నుంచే ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక చికాగోలో మూడు గంటల పాటు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *