Wednesday, May 14, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅమ్మలకోసం ఒకరోజు

అమ్మలకోసం ఒకరోజు

మదర్స్ డే నా? మా కాలంలో ఇలాంటివి తెలియదు అంటారో బామ్మగారు తన పిల్లలు, మనుమల నుంచి అందుతున్న అభినందనలకు మురిసిపోతూనే. కానీ నిజానికి బామ్మగారి బాల్యానికే ఇటువంటి రోజు ఉందని చాలా మందికి తెలియదు. గత కొన్నేళ్లుగా మార్కెటింగ్ పోకడల పుణ్యమా అని వ్యాప్తిలో కొచ్చిన వాటిలో మదర్స్ డే చేరింది. ఏమీ ఆశించకుండా కుటుంబం కోసం కష్టపడే మాతృమూర్తిని ఈ విధంగానైనా సంతోషపెట్టడం మంచిదే. ఒక్కసారి ఈ వేడుక పుట్టుక , వివరాలు చూద్దాం.

వాస్తవానికి గ్రీకులు, రోమన్ల కాలం నుంచీ మాతృత్వాన్ని వేడుకగా జరుపుకోవడం ఉంది. దేవతలా పేరిట, పండుగల్లో భాగంగా జరుపుతూనే ఉన్నారు. అంతవరకూ ఎందుకు? మన బతకమ్మ, దసరా వంటి పండుగలు కూడా అమ్మలవే. మన జిజియాబాయి, ఝాన్సీ లక్ష్మీ బాయి వంటి వీర మాతలు ఎందరో.

పాశ్చాత్య దేశాల్లో ఇటువంటివి ఒక ప్రత్యేక రోజుగా పాటించడం ఎక్కువ. పైగా వీటిచుట్టూ జరిగే వ్యాపారం కారణంగా కూడా విపరీతమైన ప్రచారం వచ్చింది.

ఇలాంటి వాటన్నింటికి ఆద్యులు అమెరికా మహిళలే అని చెప్పాలి. ఎలాగైనా తల్లులకోసమంటూ ఒక రోజు ఉండాలని కృషి చేసినవారిలో మొదట జార్విస్, తర్వాత జూలియా వార్డ్ హోవె ముఖ్యులు. అయితే వీరు కోరుకుంది మహిళలంతా ఒకరోజు ఆనందంగా గడపాలని. ఆ విధంగానే కొన్ని కార్యక్రమాలూ నిర్వహించారు. కానీ ఇందులో వ్యాపారకోణం పట్టుకున్న శక్తులు దీన్ని పూర్తిగా వ్యాపారమయం చేశాయి. 1908 లో అన్నా మారియా జార్విస్ మదర్స్ డే ప్రారంభించినా 1914 లో అధికారికం అయింది. అయితే కొన్నిదేశాల్లో వేరే రోజున పాటిస్తారు. అన్నా జార్విస్ పోరాట ఫలితం గానే 1914 లో మే నెల రెండో ఆదివారాన్ని మదర్స్ డే గా ప్రకటించారు. అయితే ఈ రోజును పూర్తి వ్యాపారమయం చేయడంతో నిరాశ చెందిన అన్నా ఈ రోజును సెలవు గా ఎత్తేయాలనీ ఉద్యమించారు గానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు.

ప్రతి విషయం లోనూ మంచినే చూడాలని అనుకుంటే మాత్రం కనీసం ఈ రోజయినా కన్నతల్లికి కూసింత సంతోషం లభిస్తుంటే,ఈ రోజుకి సార్థకత లభించినట్లే.

మరికొన్ని విశేషాలు

  • మదర్స్ డే ఆదివారం కావడం వల్ల ఎక్కువమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు
  • అమెరికాలో 25 శాతం పూల అమ్మకాలు ఈ ఒక్కరోజునే జరుగుతాయి
  • అత్యధికంగా గ్రీటింగ్ కార్డులు అమ్ముడయ్యే రోజుల్లో మదర్స్ డే ఒకటి
  • ఆస్ట్రేలియాలో ఈ రోజున ఒక ఫన్ రన్ నిర్వహించి నిధులు సేకరించి బ్రెస్ట్ కాన్సర్ నివారణకు ఉపయోగిస్తారు.

– కె .శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్