Saturday, November 23, 2024
HomeTrending Newsకమ్యూనిస్టులకు ఇవి పట్టవా? సోము ప్రశ్న

కమ్యూనిస్టులకు ఇవి పట్టవా? సోము ప్రశ్న

Saffron  fire on Red:  విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఉద్యమం చేస్తోన్న కమ్యూనిస్టులు  రాష్ట్ర ప్రభుత్వం అమ్మకం చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలపై ఎందుకు ఉద్యమాలు చేపట్టడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు.  కృష్ణపట్నం జెన్ కో పవర్ ప్లాంట్ అమ్ముతుంటే, విజయనగరం జిల్లాలో చక్కర ఫ్యాక్టరీలు అమ్ముతుంటే ఏం చేస్తున్నారని, ఎందుకు ఉద్యమాలు చేయడంలేదని….. గతంలో చంద్రబాబు ప్రభుత్వ డెయిరీలు అమ్ముతుంటే ఎందుకు నోరుమూసుకుని కూర్చున్నారని నిలదీశారు. షుగర్ ఫ్యాక్టరీలు అమ్ముతుంటూ ప్రభుత్వం ఆ భూములను వేలం వేస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు. మొన్న కూడా బడ్జెట్ లో స్టీల్ ప్లాంట్ కోసం 910 కోట్ల రూపాయలు  కేటాయించిందని చెప్పారు. విజయనగరంలో పార్టీ నేతలతో కలిసి సోము మీడియాతో మాట్లాడారు.  జిల్లాలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని, షుగర్ ప్రాజెక్టులు ఎందుకు మూసివేస్తున్నారని ప్రశ్నించారు.

బియ్యం ఎగుమతులపై చర్యలు తీసుకోవాలని సోము డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో చిన్న మొత్తంలో జరిగేవని, ఇప్పుడు పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతోందని చెప్పారు. మిల్లర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అటు రైతులకు, ఇటు ప్రజలకు కూడా అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు.  ముగ్గురాళ్ళు, చీమకుర్తి గనులు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని, ఎర్రచందనం, ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీటిపై అదనంగా దాదాపు 30 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రతి ఏటా సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. ఈ నిధుల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించకుండా, తమ వద్ద డబ్బులు లేవని మంత్రులతో చెప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఇళ్ళ నిర్మాణం నత్త నడకన సాగుతోందని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇళ్ళను కూడా పూర్తి చేయలేకపోతోందని, కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్రం ప్రభుత్వం తన వాటా మంజూరు చేయలేక నిర్మాణం నిలిచిపోయిందని చెప్పారు. తాము అడుగుతుంటే తాము ఇళ్ళ స్థలాలు ఇచ్చామని చెబుతున్నారని, ఇది సరికాదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్