Saturday, April 20, 2024
HomeTrending Newsచర్చలు జరపాలి: సోము డిమాండ్

చర్చలు జరపాలి: సోము డిమాండ్

We Support: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు చేసే పోరాటానికి బిజెపి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి రాగానే వెంటనే పీఆర్సీ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెండున్నరేళ్ళ తరువాత ఐఆర్ కంటే తక్కువ పీఆర్సీ ప్రకటించి ఉద్యోగులను మోసం చేశారని సోము ఆరోపించారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకున్నారని కానీ ఇది ఉద్యోగుల ఎనిమీ ప్రభుత్వమని మండిపడ్డారు. కర్నూలులో ఎంపీ టిజి వెంకటేష్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి లతో కలిసి వీర్రాజు మీడియాతో మాట్లాడారు.

ఉద్యోగుల సహకారం లేకుండా ప్రభుత్వాన్ని నడపడం అసాధ్యమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో అద్దెలు విపరీతంగా పెరిగిన సమయంలో హెచ్ఆర్ఏ ను ఎలా తగ్గిస్తుందని సోము ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా తగ్గించిన దాఖలాలు లేవన్నారు. పీఆర్సీ పేరిట ఉద్యోగులను నట్టేట ముంచిందని, వారికి  రావాల్సిన బకాయిల గురించి ప్రభుత్వం కనీసం స్పందించడంలేదన్నారు.

ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, వెంటనే పీఆర్సీ జీవోలను రద్దు చేయాలనీ ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగుల పట్ల ఇంత అన్యాయంగా ప్రవర్తించిన సందర్భం గతంలో ఎన్నడూ లేదన్నారు. జీత బత్యాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా వ్యత్యాసం ఉంటుందని, దీన్ని పట్టించుకోకుండా నోటికొచ్చినట్లు ప్రభుత్వం చెప్పడం సబబు కాదన్నారు. ఉద్యోగుల పక్షాన బిజెపి పోరాడుతుందని సోము వీర్రాజు హామీ ఇచ్చారు.

Also Read : ఉద్యోగులు ఆలోచించాలి: సిఎస్ సూచన

RELATED ARTICLES

Most Popular

న్యూస్