ఫిబ్రవరి 7న ‘ఎఫ్ 3’ ఫస్ట్ సింగిల్ ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’

Dabbu Song: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి `ఎఫ్ 3` సినిమాతో ఈ వేసవికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మొదటి పాట అయిన `లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు` ఫిబ్రవరి 7న రాబోతోందని తెలియ‌చేస్తూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఇక ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయింది. ఒక్క సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతోన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Also Read : వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ టాకీ పార్ట్ పూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *