Tuesday, February 25, 2025
HomeTrending Newsసోనియాగాంధీకి అస్వస్థత

సోనియాగాంధీకి అస్వస్థత

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాస్పిటల్‌లో చేరారు. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియాను.. గంగారాం హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. డాక్టర్‌ అరూప్ బసు ఆధ్వర్యంలో చికిత్స అందుతుందని తెలిపిన వైద్యులు.. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అవసరమైన టెస్టులు చేయిస్తున్నామని.. అబ్జర్వేషన్‌లో ఉంచామన్నారు.

గురువారమే సోనియాను ఆస్పత్రిలో చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఆస్పత్రి హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కాగా, సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా జనవరిలోనూ ఆమె ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్