Saturday, September 21, 2024
HomeTrending Newsతవాంగ్ వ్యవహారంలో కేంద్రం తీరు ఆక్షేపనీయం - కాంగ్రెస్

తవాంగ్ వ్యవహారంలో కేంద్రం తీరు ఆక్షేపనీయం – కాంగ్రెస్

దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతోందో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని…దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టె విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ లో చైనా దళాల దాడిపై పార్లమెంటులో చర్చకు అనుమతించడం లేదని సోనియా గాంధీ ఈ రోజు (బుధవారం) ఆరోపించారు. ఆ పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సరిహద్దుల్లో చైనా తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని, ఈ అంశంపై చర్చకు అనుమతించడం లేదని మండిపడ్డారు. ప్రజలు, పార్లమెంటు వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం సాధ్యం కావడం లేదన్నారు. చైనీస్ అతిక్రమణలకు ఫైనాన్షియల్ రిప్లైని ప్రభుత్వం ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు.

సోనియా గాంధి అధ్యక్షతన పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్లమెంటు భవన సముదాయంలోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష పార్టీల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ఖర్గే, పి చిదంబరం కూడా పాల్గొన్నారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 7న ప్రారంభమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ సెక్టర్‌లో డిసెంబరు 9న భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది. మన సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ అంశంపై పార్లమెంటులో చర్చించాలని తాము కోరుతున్నప్పటికీ ప్రభుత్వం అంగీకరించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2020 జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గాల్వన్ వద్ద భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలు తాజా ఘర్షణతో మరింత దయనీయ స్థితికి చేరాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్