Johannesburg Test: ఇండియా- సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది. జోహెన్స్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ మరో రోజు మిగిలి ఉండగానే ముగిసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ 96 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వర్షం కారణంగా నేటి ఆట ఆలస్యంగా, మూడవ సెషన్ నుంచి మొదలైంది. రెండు వికెట్ల నష్టానికి 118 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద నేటి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా దూకుడుగానే ఆడింది. వాన్ డర్ డుస్సేన్-40 పరుగులు చేసి ఔటవ్వగా, ఆ తర్వాత వచ్చిన తెంబా బావుమా-23 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. షమీ, శార్దుల్, రవిచంద్రన్ అశ్విన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ 1-1 తో సమం అయ్యింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టెస్ట్ కేప్ టౌన్ లో జనవరి 11 నుంచి మొదలు కానుంది.
Also Read :విజయం ముంగిట సౌతాఫ్రికా