Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్విజయం ముంగిట సౌతాఫ్రికా

విజయం ముంగిట సౌతాఫ్రికా

Johannesburg Test:  వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టుపై సౌతాఫ్రికా పట్టు బిగించింది. విజయానికి 122 పరుగులు కావాల్సి ఉంది, చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఇంకా రెండ్రోజుల ఆట మిగిలి ఉంది. రేపు నాలుగో రోజున ఇండియా బౌలర్లు అద్భుతాలు సృష్టిస్తే తప్ప, సౌతాఫ్రికా ఈ టెస్టులో విజయం సాధించే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి.

రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 85 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద నేటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాలో మూడో వికెట్ కు పుజారా-రెహానే 111 పరుగుల చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. స్కోరు 155 వద్ద రాబడ బౌలింగ్ లో రెహానే(58) ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రబడ పుజారాను కూడా ఎల్బీగా అవుట్ చేశాడు. ఆ తర్వాత హనుమ విహారి-40; శార్దూల్ ఠాకూర్-28, అశ్విన్-16 పరుగులు చేశారు, 266 పరుగులకు ఇండియా ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబడ, నిగిడి, మార్కో జాన్సేన్ తలా మూడు, ఒలివియర్ ఒక వికెట్ పడగొట్టారు.

240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.  జట్టు స్కోరు 47 వద్ద మార్ క్రమ్(31)ను శార్దూల్ ఎల్బీగా అవుట్ చేశాడు.  93 పరుగుల వద్ద కీగాన్ పీటర్సన్ (28)ను అశ్విన్ ఎల్బీగా పెవిలియన్ పంపాడు. కెప్టెన్ ఎల్గర్-46; వాన్డేర్ దస్సేన్ -11 పరుగులతోను క్రీజులో ఉన్నారు.

Also Read : సౌతాఫ్రికా 229 ఆలౌట్;  శార్దూల్ కు ఏడు వికెట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్