SA won ODI Series also: ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ను గెల్చుకున్న సౌతాఫ్రికా వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. రెండో వన్డేలో ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఇండియా విసిరిన 288 పరుగుల విజయ లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. తొలి వికెట్ కు 132 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 78 పరుగులు (66 బంతులలో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ జన్నేమన్ మలాన్ 91 (108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు. కెప్టెన్ బావుమా-35 పరుగులు చేయగా; మార్ క్రమ్; రస్సీ వాన్ డర్ దస్సేన్ చెరో 37 పరుగులతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో బుమ్రా, శార్దూల్, చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
పార్ల్ లోని బొలాండ్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రాహుల్, ధావన్ తొలి వికెట్ కు 63 పరుగులు చేశారు. ధావన్ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. ఈ దశలో మూడో వికెట్ కు రాహూల్- రిషభ్ పంత్ 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి సత్తా చాటారు. రాహుల్-55; పంత్-85 పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో శార్దూల్ ఠాకూర్-40; అశ్విన్- 25 పరుగులతో రాణించడంతో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో శంషి రెండు; మగల, మార్ క్రమ్, మహారాజ్, పెహ్లుక్యాయో తలా ఒక వికెట్ రాబట్టారు.
డికాక్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను సౌతాఫ్రికా 2-0 తో గెల్చుకుంది
Also Read : తొలి వన్డేలో సౌతాఫ్రికా విజయం