మీకు బాధ్యత లేదా? తమ్మినేని ప్రశ్న

కోనసీమ జిల్లాకు డా. అంబేద్కర్ పేరు వద్దని  ప్రకటించే దమ్ము ఏ పార్టీకైనా ఉందా అని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. అక్కడ ఇష్టం లేకపోతే తమ శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్- పూలే పేరు పెట్టాలని అయన సూచించారు. కులాల పేరుతో  కురుక్షేత్రం  నడుపుతున్నారని ఆరోపించిన అయన, కులాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. అందరికీ మహనీయుడైన అంబేద్కర్ పేరు కోనసీమ జిల్లాకు  పెడితే తప్పేంటని, ఆయన పెట్టిన రిజర్వేషన్ల ఫలాలే  నేడు అనుభవిస్తున్నామని అన్నారు. అన్ని పార్టీలు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

సమస్యలు ఉంటే చెప్పుకోవాలి గానీ విద్వంసాలకు దిగడం సరికాదని, మంత్రి, ఎమ్మెల్యే ఇంటికి అగ్గి పెట్టడం దారుణమని తమ్మినేని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం భాద్యత  వహించాలంటున్న పవన్ కి బాద్యత లేదా అని నిలదీశారు.  విచారణలో కుట్ర దారులు  భయటపడతారు .. అప్పుడు వారికుంటాది  బాదుడే  బాదుడు అని వ్యాఖ్యానించారు.

సామాజిక న్యాయ బేరి బస్సుయాత్ర ప్రారంభిస్తున్నామని,  అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేస్తున్నామని సీతారాం వెల్లడించారు. చేసింది చెప్పుకోవడం లో వెనుకబడకూడదని, ఏమి చేయకుండానే.. కొన్ని పార్టీలు అభూబూత కల్పనలు చేస్తున్నాయని, వాటికి ఖచ్చితంగా సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *