Sunday, September 8, 2024
HomeTrending Newsరేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ - ఈటెల తూటాలు

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ – ఈటెల తూటాలు

దేశంలో అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి ఎదిగాడని విమర్శించారు. ఆయన నాలుగు పార్టీలు మారలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గెలవదనే నిరాశ, నిస్పృహలతో రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఈటల రాజేందర్. ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ ఉమ్మడిజిల్లా జెడ్పీ చైర్మన్ తుల ఉమ, బీజేపీ నాయకులు ప్రేమెందర్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి, అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ, ప్రకాష్ రెడ్డి, అందే బాబయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పెద్దల అహంకారం వల్లే ఆ పార్టీకి ఈ పరిస్థితి అని ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కాంగ్రెస్సేనని, ముఖ్యమంత్రులను లెక్క చేయని అహంకారం ఆ పార్టీది అని విమర్శించారు.

దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని, ఒక్క రాజస్థాన్ లోనే ఉన్నట్లుందని బిజెపి నేత ఈటెల వ్యంగ్యంగా విమర్శించారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ఆయన ధర్మాన్ని నిర్వర్తించాడని, బీజేపీ సిద్దాంతం ఉన్న పార్టీ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీకి మెజారిటీ ఉన్నా… శివసేన అపవిత్ర పొత్తుకు శ్రీకారం చుట్టిందన్నారు.  సిద్ధాంతంలో బాల్ థాకరే అందె వేసినవారని చెప్పారు. ప్రజలు ఛీకొడుతుంటే ఉద్ధవ్ థాకరేకు ఏక్‌నాథ్ షిండే ఎదురు తిరిగారని అన్నారు.

యూపీలో 403 స్థానాలు ఉంటే.. కాంగ్రెస్ ఎన్ని గెలిచిందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని తిరస్కరిస్తే కేరళకు వెళ్లాల్సి వచ్చిందని ఎద్దేవా చేవారు. తమిళనాడులో స్టాలిన్‌కు, జార్ఖండ్‌లో సోరెన్‌కు టీఆర్ఎస్ డబ్బులు పంపిందని ఆరోపించారు. అలాంటప్పుడు టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలోనే రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించామని చెప్పారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పినా ఆయన టీఆర్ఎస్‌లోకి రాలేదన్నారు. ఆర్థికంగా దెబ్బతీసినా కాంగ్రెస్‌లోనే ఉన్నారని చెప్పారు.

నల్గొండ జిల్లాలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఈటెల రాజేందర్ చెప్పారు. అక్కడ ప్రజలు కేసీఆర్ అహంకారం ఓడిపోతుందా? లేదా? అని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు. చనిపోతున్న కాంగ్రెస్ గురించి ప్రజలు ఆలోచించడం లేదని రాజేందర్ పేర్కొన్నారు.

Also Read ఎనిమిదేళ్ళలో కెసిఆర్ సామాన్యులను కలిశారా ఈటెల రాజేందర్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్