Thursday, March 19, 2026
Homeసినిమా105 మినిట్స్ స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్

105 మినిట్స్ స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్

హన్సిక మోత్వాని ప్రధాన పాత్ర లో రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై ఒకే పాత్రతో సింగిల్ షాట్ ఫార్మాట్ లో నిర్మించిన చిత్రం “105 మినిట్స్” బొమ్మక్ శివ నిర్మాణంలో దర్శకుడు రాజు దుస్సా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం మేకింగ్ పరంగా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతోంది. ఈరోజు హీరోయిన్ హన్సిక మోత్వానీ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ డిజైన్ కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. త్వరలో టీజర్ ను విడుదల  చేయనున్నారు.

 రాజు దుస్సా మాట్లాడుతూ “మా హీరోయిన్ హన్సిక గారికి టీమ్ అందరి తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాం. ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాం. ఈ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది. త్వరలో టీజర్, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలు ఉంటాయి. సినిమాను చిత్రీకరించిన తీరు మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. హన్సిక నటన మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో “105 మినిట్స్” సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాం అన్నారు.

Also Read : ‘105 మినిట్స్’ గొప్ప విజయం సాధించాలి : హన్సిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular