Sunday, June 28, 2026
Homeసినిమా‘ఎఫ్ 3’ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల

‘ఎఫ్ 3’ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల

Money is the Best: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి సమ్మర్ సోగ్గాళ్లుగా వేసవికి మూడు రెట్ల వినోదాన్ని ఇచ్చేందుకు ఎఫ్ 3 సినిమాతో రాబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎఫ్-3’ టీం నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వరుణ్ సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమా అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతుందని ఇది వరకే తెలిపింది చిత్రయూనిట్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లోనూ వరుణ్ తేజ్ చేతిలో కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి.

వేసవి సందర్భంగా ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఇది వరకు ఏప్రిల్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు కానీ.. దాని కంటే ఒక రోజు ముందే అంటే ఏప్రిల్ 28న సినిమాను రిలీజ్ చేయబోతోన్నారు.  2019 సంక్రాంతి విన్నర్‌గా ‘ఎఫ్ 2’ నిలిచింది. ఇక ఎఫ్ 3 అయితే సమ్మర్‌లో వినోద విందు చేసేందుకు రాబోతోంది. సినిమా మీద అంచనాలు, పాజిటివ్ బజ్‌కు తగ్గట్టే అంచనాలను మించి ఉండబోతోంది.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ వంటి వారితో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మూడో హీరోయిన్‌గా ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ కనిపించబోతోన్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read : వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ‘గని’ టీజర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular