Sunday, June 7, 2026
HomeTrending Newsజూన్ నాటికి తొలిదశ డిజిటల్ లైబ్రరీలు: సిఎం

జూన్ నాటికి తొలిదశ డిజిటల్ లైబ్రరీలు: సిఎం

Make it fast: జూన్‌ నాటికి డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతోనే వర్క్‌ ఫ్రమ్ హోమ్ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.  వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎం చేసిన సూచనలు:

⦿ ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్‌ టాప్‌, యూపీఎస్‌, ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు డెస్క్‌ టాప్ టేబుల్స్‌, సిస్టం ఛెయిర్స్‌, ఫ్యాన్స్‌, ట్యూబ్‌ లైట్లు, ఐరన్ రాక్స్‌ ఏర్పాటు చేయాలి
⦿ ఫేజ్‌ 1 లో మిగిలిపోయిన డిజిటల్‌ లైబ్రరీలను ఫేజ్‌ 2లో కవర్‌ అయ్యేలా చూడండి
⦿ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లవుతుంది
⦿ యుద్ధ ప్రాతిపదికిన డిజిటల్‌ లైబ్రరీలు పూర్తి చేయాలి
⦿ ఇంకా మొదలుకాని చోట్ల పనులు వెంటనే ప్రారంభించాలి
⦿ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై మరింత ధ్యాస పెట్టి పూర్తి చేయాలి

ఈ సందర్భంగా అధికారులు నిర్మాణ పనుల్లో పురోగతిని సీఎంకు వివరించారు. ఫేజ్‌ -1లో 4530 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు లక్ష్యంగా నిర్ధేశించుకున్నమని, తొలిదశలో నిర్మిస్తున్న డిజిటల్ లైబ్రరీలకు అవసరమైన నెట్ కనెక్టివిటీ  ఫిబ్రవరి 2022 నాటికి  పూర్తవుతుందని తెలియజేశారు.

ఈ సమీక్షా సమావేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, విద్యుత్‌ శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,  సీఎస్‌ సమీర్‌ శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్యుత్‌శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీజెన్‌కో ఎండీ బి శ్రీధర్,  ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఏపీటీఎస్‌ ఎండీ ఎం నందకిషోర్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం మధుసూధన్‌ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌ ఎస్‌ ఎస్‌ మోహన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular