Friday, January 24, 2025
HomeTrending Newsసానియా మీర్జా కొడుక్కి వీసా సమస్య

సానియా మీర్జా కొడుక్కి వీసా సమస్య

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండేళ్ళ కొడుక్కి వీసా సమస్య ఎదురైంది. ఈ విషంలో జోక్యం చేసుకుని వీసా మంజూరయ్యేలా చూడాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విదేశాంగ శాఖ సాయాన్ని కోరింది.
జూన్ నెలలో వింబుల్డన్ తో పాటు మరో రెండు టోర్నీ ల్లో పాల్గొనేందుకు సానియా మీర్జా లండన్ వెళ్ళాల్సి వుంది. ఆమెకు వీసా కూడా మంజూరైంది. అయితే నెలరోజులపాటు సాగే పర్యటన కాబట్టి రెండేళ్ళ కొడుకుని ఒంటరిగా వెళ్ళడం సాధ్యపడదని, తన కుమారుడికి, మరో సంరక్షురాలికి కూడా వీసా ఇప్పించాలని సానియా క్రీడా శాఖను కోరింది.
ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. సానియా కోరినట్లుగా ఆమె కొడుక్కి, కేర్ టేకర్ కి వీసా మంజూరయ్యేలా చూడాలని లండన్ లోని భారత ఎంబసీని విదేశాంగ శాఖ కోరింది.
ఈ ప్రతిపాదన తన దృష్టికి రాగానే విదేశాంగ శాఖకు పంపానని, త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్