Thursday, April 18, 2024
Homeసినిమాచిరు, బాలయ్య సినిమాల్లో శ్రీముఖి..?

చిరు, బాలయ్య సినిమాల్లో శ్రీముఖి..?

యాంకర్ శ్రీముఖి ఓ వైపు బుల్లితెర పై యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో నటిస్తుంది. ఆమె ఎనర్జీ.. స్టైల్ ఆకట్టుకోవడంతో బుల్లితెర పై బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు వెండితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటుంది. ఆ మధ్య ఆమె కొన్ని సినిమాల్లో మెరిసింది కానీ.. ఆతర్వాత టీవీ షోస్ పైనే దృష్టిపెడుతూ వచ్చింది. గ్లామర్ పరంగా ఒక స్టార్ హీరోయిన్ కి ఉండవలసిన క్రేజ్ ఆమెకి ఉంది. అయితే.. ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది.

ఇంతకీ ఏ సినిమాలో అంటే..భోళా శంకర్ మూవీలో. మెహర్ రమేష్ డైరెక్షన్ లో మూవీ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుంటే… చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాలో శ్రీముఖి ఓ ముఖ్యమైన పాత్రను పోషించనుందని సమాచారం. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొననుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత శ్రీముఖి వరుసగా అవకాశాలు అందిపుచ్చుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

అయితే.. భోళా శంకర్ మూవీ రిలీజ్ కాకుండానే శ్రీముఖి మరో క్రేజీ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇంతకీ ఏ సినిమా అంటే… బాలకృష్ణ సినిమాలో. అవును.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణ తన 108వ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఆమెకి ఫ్రెండ్ గా శ్రీముఖి నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. మొదటి నుంచి చివరి వరకూ ఈ పాత్ర తెర పై కనిపిస్తుందని చెబుతున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలిసింది. మరి.. చిరు భోళా శంకర్, బాలయ్య 108 రిలీజ్ తర్వాత శ్రీముఖి వరుసగా మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుందేమో చూడాలి.

Also Read: బాలకృష్ణ, అనిల్ రావిపూడి చిత్రం గ్రాండ్ గా ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్