Saturday, November 23, 2024
HomeTrending Newsశ్రీలంకకు రండి : సిఎం జగన్ కు ఆహ్వానం

శ్రీలంకకు రండి : సిఎం జగన్ కు ఆహ్వానం

శ్రీలంక ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ సెంథిల్‌ తొండమాన్, శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్‌ డాక్టర్‌ డి వెంకటేశ్వరన్‌ లు తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీలంకలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని  ఆ దేశ ప్రతినిధులు  చేసిన విజ్ఞప్తికి సిఎం సానుకూలంగా స్పందించారు.  శ్రీలంక నుంచి భారత దేశానికి వచ్చే భక్తుల్లో 50శాతం మంది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వస్తారని, వారి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి విన్నామని వారు సిఎంకు తెలియజేశారు. అందుకే  జగన్‌ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలన్న తమ అధ్యక్షుడి ఆదేశాల మేరకు  కలిశామని వారు వివరించారు.

వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న వారు సిఎంకు వివరించారు.  ఆక్వారంగం, వాటి ఎగుమతుల్లో ఏపీ గణనీయ ప్రగతి సాధించిన నేపధ్యంలో… శ్రీలంకలో కూడా ఆక్వారంగ ప్రగతికి సహకారం అందించాలని కోరారు. కోవిడ్, దిగుమతులు కారణంగా దెబ్బతిన్న శ్రీలంక ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతోందని.., ఖనిజవనరులు, పర్యాటకరంగంలో పెట్టుబడులను తమ ప్రభుత్వం ఆహ్వానిస్తోందని వారు సిఎం కు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్