Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్రాణించిన బౌలర్లు: శ్రీలంకదే టి-20 సిరీస్

రాణించిన బౌలర్లు: శ్రీలంకదే టి-20 సిరీస్

బౌలర్లు అద్భుతంగా రాణించడంతో నిర్ణయాత్మక మూడో టి-20 లో శ్రీలంక విజయం సాధించి సిరీస్ ను గెల్చుకుంది. శ్రీలంక జట్టు బౌలింగ్ తో పాటు అద్భుత ఫీల్డింగ్ తో యువ ఇండియన్లకు చుక్కలు చూపించారు. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ధావన్ డకౌట్ గా వెనుదిరిగాడు. అప్పటి నుంచే ఇండియా కష్టాలు మొదలయ్యాయి. లంక బౌలర్ హసరంగ నాలుగు వికెట్లతో రాణించాడు. తాను వేసిన రెండో ఓవర్లో రెండు వికెట్లు సాధించి ఇండియా టాపార్డర్ ను కుప్పకూల్చాడు. ఇండియా జట్టులో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. బౌలర్ కులదీప్ యాదవ్ 23 పరుగులు చేసి అధిక స్కోరర్ గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ 16, రుతురాజ్ గైక్వాడ్ 14 పరుగులు చేశారు. ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ దాసున్ షనక రెండు వికెట్లు సాధించాడు.

82 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రాహుల్ చాహర్ కే ఈ మూడు వికెట్లు దక్కడం విశేషం. ధనుంజయ డిసిల్వా 23, మినోద్ భానుక 18, హసరంగ పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.  హసరంగ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ తో పాటు, ప్లేయర్ అఫ్ ద సిరీస్ కూడా గెల్చుకున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్