Friday, March 20, 2026
Homeసినిమాశ్రీవిష్ణు ‘భళా తందనాన’ ఫస్ట్ లుక్ విడుద‌ల‌

శ్రీవిష్ణు ‘భళా తందనాన’ ఫస్ట్ లుక్ విడుద‌ల‌

Bhala Tandanana First Look :

విలక్షణ కథలతో తన మార్క్ చూపెడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం ‘భళా తందనాన’ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో న‌టిస్తున్నారు. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్. రీసెంట్‌గా మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఇక‌ ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు ‘భళా తందనాన` ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇన్ సైడ్ వైట్ టీ షర్ట్ ధరించి డెనిమ్ షర్ట్, బ్లూ జీన్స్‌తో ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న శ్రీ విష్ణు లుక్ సినిమా పై ఆసక్తి పెంచేస్తోంది.

చేతిలో రెండు తుపాకులు పట్టుకొని ఎంతో కోపంగా కనిపిస్తున్న శ్రీ విష్ణు చుట్టూ రౌడీ గ్యాంగ్ కనిపిస్తుండటం ఈ కథ ఎంత స్ట్రాంగ్‌గా ఉండనుందో చెబుతోంది. ‘భళా తందనాన’ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లకు కొదవే ఉండదని తెలుస్తోంది. హీరో శ్రీ విష్ణుని ఇప్పటిదాకా చూడని డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నారు డైరెక్టర్ చైతన్య దంతులూరి. చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా రోల్ కి కూడా ప్రాముఖ్యత ఉంది. ఇక ప్రతినాయకుడిగా కేజిఎఫ్ ఫేమ్ రామచంద్ర రాజు రోల్ మరింత పవర్ ఫుల్‌గా ఉండనుంది.

పాపులర్ ప్రొడక్షన్ హౌస్ వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ బాణీలు కడుతుండగా.. సురేష్ రగుతు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా రచయితగా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Also Read :  ‘అర్జున ఫల్గుణ’ నుంచి ఒక తీయని మాటతో.. సాంగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular