‘కొత్త బంగారులోకం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. వెంకటేష్, మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు అనే భారీ మల్టీస్టారర్ తీసి బిగ్ సక్సెస్ సాధించాడు. ఇటీవల వెంకటేష్ తో ‘నారప్ప’ అనే యాక్షన్ మూవీ చేశాడు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాల నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు.
ఆమధ్య శ్రీకాంత్ అడ్డాల… బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. బాలయ్యకు కథ చెబితే ఓకే చెప్పాడు. త్వరలో అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే.. ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… శ్రీకాంత్ అడ్డాల, వెంకటేష్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్ కి శ్రీకాంత్ అడ్డాల ఓ కథ చెప్పాడని, వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా అని, తండ్రికూతుర్ల మధ్య ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. మిస్ అయిపోయిన ఓ కూతురు కోసం ఒక తండ్రి పడే తపన, ఆవేదన ఈ సినిమా అని టాక్ వినిపిస్తోంది. నిర్మాత సురేష్ బాబు, వెంకటేష్ హీరోగా ఈ సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడట. దీంతో శ్రీకాంత్ అడ్డాల నెక్ట్స్ మూవీ వెంకటేష్ తోనా..? బాలకృష్ణతోనా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Also Read : వెంకీ, రవితేజ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్..?