శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ జూన్ 2న విడుదల

కొత్త బంగారులోకం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల ఆతర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. ఆతర్వాత తెరకెక్కించిన బ్రహ్మోత్సవం చిత్రం ప్లాప్ అయ్యింది. కొంత గ్యాప్ తర్వాత ఈమధ్య వెంకటేష్ తో ‘నారప్ప’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమాను ప్రకటించారు.

ప్రస్తుతం ద్వారకా క్రియేషన్స్‌ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో కొత్త సినిమా చేస్తున్నారు. మిర్యాల సత్యనారాయణరెడ్డి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జూన్ 2న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ ని విడుదల చేయనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో రక్తం గుర్తులతో ఉన్న చేతిని మనం చూడవచ్చు. మరో 3 రోజుల్లో టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానున్నాయి. ద్వారకా క్రియేషన్స్ గత చిత్రం ‘అఖండ’తో సంచలన బ్లాక్‌బస్టర్‌ ని అందించింది. దీంతో వీరి నుంచి రాబోతున్న ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే శ్రీకాంత్ అడ్డాల న్యూ ఏజ్ సినిమాతో రాబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *