Thursday, March 19, 2026
Homeసినిమాఫిబ్రవరి 4న శ్రీకాంత్ ‘కోతలరాముడు’ విడుదల

ఫిబ్రవరి 4న శ్రీకాంత్ ‘కోతలరాముడు’ విడుదల

Kothala Rayudu:  శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో రూపొందిన విభిన్న క‌థా చిత్రం ‘కోతల రాయుడు’. వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1గా కొలన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ‘కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో పృథ్వీ, మురళి శర్మ, సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళి, సుడిగాలి సుధీర్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, ఫైట్స్ బాగున్నాయి. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులు మెచ్చుకునే అంశాలు సినిమాలో ఉన్నాయని, శ్రీకాంత్ పాత్ర అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని దర్శకుడు సుధీర్ రాజు తెలిపారు. మంచి సినిమా ఎప్పుడొచ్చినా తెలుగు ప్రేక్షకులు త‌ప్ప‌కుండా ఆదరిస్తారని..  కోతలరాయుడు సినిమా మా అందరికి మంచి పేరు తెచ్చిపెడుతుందని నిర్మాతలు ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ తెలిపారు.

శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్, సత్యం రాజేష్, పృద్వి, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీ లక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్ త‌దిత‌రులు న‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular