Wednesday, April 17, 2024
Homeస్పోర్ట్స్చరిత్ర సృష్టించిన నాదల్: ఆస్ట్రేలియన్ టైటిల్ గెలుపు

చరిత్ర సృష్టించిన నాదల్: ఆస్ట్రేలియన్ టైటిల్ గెలుపు

Rafael Nadal History: స్పెయిన్ కు చెందిన టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ చరిత్ర సృష్టించాడు. టెన్నిస్ చరిత్రలో 21 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పి తన పేరిట సువర్ణాధ్యాయం లిఖించుకున్నాడు.

నేడు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ లో రష్యా రష్యన్ ఆటగాడు మెద్వదేవ్ పై 2-6; 6-7, 6-4;6-4; 7-5తో విజయం సాధించారు. 5 గంటల 24 నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ  మ్యాచ్ లో  ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపద్దారు. మెద్వదేవ్ చివరి క్షణం వరకూ గట్టి పోటీ ఇచ్చాడు. రఫెల్ కూడా తొలి రెండు సెట్లు కోల్పోయినా ఏమాత్రం తన ఆటపై పట్టు సడలనీయకుండా తర్వాతి రెండు సెట్లూ గెల్చుకొని  తన అనుభవంతో పుంజుకున్నాడు. నిర్ణాయక చివరి సెట్ కూడా అత్యంతం ఉత్కంఠగా సాగింది. చివరకు రాఫెల్ తన అనుభవాన్ని రంగరించి గెలుపొందాడు.

ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఆరో సీడ్ లో కొనసాగుతున్న నాదల్, రెండో సీడ్ ఆగడాడు మెద్వదేవ్ పై విజయం సాధించారు.

ఈ విజయం ముందు వరకూ 20 టైటిల్స్ సాధించి నోవాక్ జకోవిచ్, రోజర్ ఫెదరర్ సరసన ఉన్న నాదల్ నేటి గెలుపుతో 21 సార్లు ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

ఈ విజయంతో అన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను కనీసం రెండు సార్లు గెల్చుకున్న నాలుగో ఆటగాడిగా జకోవిచ్, రాయ్ ఎమర్సన్, రాడ్ లేవర్ ల సరసన నిలిచాడు.

గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఫైనల్ లో  మెద్వదేవ్ ఓటమి పాలయ్యాడు.  అయితే ఆ తర్వాత యూఎస్ ఓపెన్ లో 6-4;6-4;6-4 తో జకోవిచ్ ను ఓడించి టైటిల్ గెల్చుకోవడమే కాకుండా జకోవిచ్ 21 గ్రాండ్ స్లామ్స్ రికార్డును కూడా కోల్పోవాల్సి వచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్