Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్ఐపీఎల్ కు స్టార్ ఆటగాళ్ళ  డుమ్మా

ఐపీఎల్ కు స్టార్ ఆటగాళ్ళ  డుమ్మా

we Can’t: ఐపీఎల్ ­2022 సీజన్ కు పలువురు విదేశీ స్టార్ ఆటగాళ్ళు డుమ్మా కొడుతున్నారు. గత మూడు నాలుగు సీజన్లుగా మంచి ఆట తీరు ప్రదర్శిస్తూ భారత క్రికెట్ ప్రేమికుల మనసులు గెల్చుకున్న ఆటగాళ్ళు ఈసారి తాము ఆడబోవడం లేదంటూ వర్తమానం పంపారు. వీరిలో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు జో రూట్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ తో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్  కూడా ఉన్నాడు.

అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్ళు స్టీవెన్ స్మిత్, పాట్ కమ్మిన్స్, డేవిడ్ వార్నర్…. సౌతాఫ్రికా ఆటగాళ్ళు డూప్లెసిస్, డికాక్..  ఇంగ్లాండ్ ఆటగాడు మార్క్ వుడ్ లు మాత్రం ఆడేందుకు తమ సంసిద్ధత వ్యక్తం చేస్తూ సమాచారం అందించారు.

మొత్తం 1214 మంది ఆటగాళ్ళతో కూడిన జాబితాను ఫ్రాంచైజీలకు ఐపీల్ నిర్వాహక కమిటీ పంపింది. వీరిలో నుంచి వారు వేలం పాట ద్వారా ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ ఆక్షన్  జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular