8.6 C
New York
Monday, December 4, 2023

Buy now

HomeTrending Newsఆచి తూచి నిర్ణయం : బుగ్గన

ఆచి తూచి నిర్ణయం : బుగ్గన

State Taxes Only On Petro Products And Liquor Says Buggana :

రాష్ట్రానికి చమురు ఉత్పత్తులు, మద్యం ద్వారా మాత్రమే నేరుగా పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని, మిగతావన్నీ జీఎస్టీ పరిధిలో ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.  పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఇప్పటికే చెప్పామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఆదాయ వనరులు చాలా అవసరమని అభిప్రాయ పడ్డారు.

బుగ్గన ఢిల్లీ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశమయ్యారు.  అంతకు ముందు ఇద్దరు ఆర్ధిక సహాయ మంత్రులను కూడా బుగ్గన కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఓ కాంట్రాక్ట్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో ఉందని …లండన్‌లో మొదటి దఫా ఆర్బిట్రేషన్ జరిగింది. ఇప్పుడు రెండవ దఫా జరగాల్సి ఉందని ఆ విషయమై కేంద్ర మంత్రులతో చర్చించామన్నారు. న్యాయపరమైన అంశాలు కాబట్టి జాప్యం జరుగుతోందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం, ఖర్చుల పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని, రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలు అంత సులభంగా తీసుకోలేమని బుగ్గన వ్యాఖ్యానించారు.  అన్ని రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి అని, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.  కేంద్రం నిర్ణయం తీసుకుంది కదా, అని 24 గంటల్లో తాము కూడా నిర్ణయాలు తీసుకోలేమని తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి: 

సుంకాన్ని భయంతో తగ్గించారు.. మనస్ఫూర్తిగా కాదు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్