Saturday, June 6, 2026
Homeసినిమాఇది బూతు సినిమా కాదు: స్ట్రీట్ లైట్ నిర్మాత

ఇది బూతు సినిమా కాదు: స్ట్రీట్ లైట్ నిర్మాత

Street Light Movie Will Be Releasing On November 19th :

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘స్ట్రీట్ లైట్’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగులో నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ స్ట్రీట్ లైట్ సినిమాని సాంకేతిక కారణాల వల్ల నవంబర్ 19న థియేటర్లలలో రిలీజ్  చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో ఓటిటి లో కాకుండా థియేటర్స్ లో ఈ సినిమాను  విడుదల చేస్తున్నాము. ఈ సినిమా ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ సినిమా అద్భుతంగా తెర కెక్కించారు.అందరూ ఈ సినిమా బూతు సినిమా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా లో ఆన్ని రకాల షేడ్స్ కలిగిన ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ కలసి చూడవలసిన సినిమా ఇది. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలని కోరుతున్నాను” అన్నారు.

చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ “పగలు మంచివాళ్ళుగా చెలామణి అవుతూ రాత్రి కాగానే సెక్సువల్ పర్వషన్స్ తో ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో, అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే ‘రివెంజ్ డ్రామా’ కథాంశంతో స్ట్రీట్ లైట్ చిత్రం రూపొందించడం జరిగింది.మంచి మేకింగ్ వాల్యూస్ తో వైవిధ్యభరితమైన సినిమాను రూపొందించి నందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అన్నారు.

Also Read :

నవంబర్ 12న తెలుగు, హిందీ భాషల్లో ‘స్ట్రీట్ లైట్’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular