Friday, June 12, 2026
Homeసినిమాసుధీర్ బాబు చిత్రానికి 'హంట్' టైటిల్

సుధీర్ బాబు చిత్రానికి ‘హంట్’ టైటిల్

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘హంట్’ టైటిల్ ఖరారు చేసినట్లు ఈ రోజు వెల్లడించారు.

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ… “సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. ఈ ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్ ఫిల్మ్. ఇప్పటి వరకు వచ్చిన సుధీర్ బాబు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సులు చాలా సహజంగా, కొత్త అనుభూతి ఇచ్చేలా ఉంటాయి. కనిపించని శత్రువు కోసం జరిపే వేట ఈ సినిమా ప్రధాన కథాంశం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తాం. ‘ప్రేమిస్తే’ భరత్ తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రమిది. కథ విన్న వెంటనే ఎగ్జైట్ అయ్యి ఓకే చెప్పారు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా బావుంటుంది” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular