Sunday, September 8, 2024
HomeTrending Newsచైనీయులు టార్గెట్ గా సూసైడ్ బాంబర్ దాడి

చైనీయులు టార్గెట్ గా సూసైడ్ బాంబర్ దాడి

పాకిస్తాన్ లో చైనా వ్యతిరేకత పెరుగుతోంది. పాక్ లో వనరులు కొల్లగుడుతూ స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తోందనే  ఆవేదన హింసాత్మకంగా మారుతోంది. తాజాగా పంజాబ్ ప్రావిన్సు లో సూసైడ్ బాంబర్ జరిపిన దాడిలో ఐదుగురు చనిపోయారు. ఇద్దరు చైనీయుల తో సహా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈస్ట్ బే రహదారి నిర్మాణ పనులు చేసుకుని తిరిగి వెళుతున్న వారిని టార్గెట్ చేస్తూ ఈ దాడి జరిగింది. పంజాబ్ రాష్ట్రం నుంచి బలూచిస్తాన్ లోని గ్వదర్ రేవును కలుపుతూ చైనా నిర్మాణ సంస్థ ఈ రోడ్డును నిర్మిస్తోంది. రోడ్డు పనుల కోసం వెళుతున్న వాహనంలో స్థానికులతో పాటు చైనీయులు కూడా ఉన్నారు.

భవాల్ నగర్ జిల్లాలోని జైలు రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు వాహనాల్లో వెళుతున్న వారిని టార్గెట్ చేస్తూ దాడికి పాల్పండింది తామేనని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీ, చైనా పౌరులు లక్ష్యంగా దాడి చేశామని, బలోచిస్తాన్ లో వనరుల దోపిడీ ఆపకపోతే మరిన్ని దాడులు చేస్తామని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెగేసి చెప్పింది.

గత నెలలో దసు జలవిద్యుత్ కేంద్రం పనుల కోసం వెళుతున్న వారిని టార్గెట్ చేస్తూ జరిగిన దాడిలో 13 మంది చనిపోయారు. మృతుల్లో తొమ్మిది మంది చైనీయులు ఉన్నారు. దాడి జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. భద్రత పూర్తి స్థాయిలో కల్పిస్తే కాని పనులు చేయలేమని చైనా సంస్థ ప్రకటించింది.చైనా సంస్థలు, పాకిస్తాన్ ప్రభుత్వం బలోచిస్తాన్ రాష్ట్రంలో గనులు కొల్లగుడుతూ ఆ ప్రాంత అభివృద్ధి పట్టించుకోవటం లేదనే అసంతృప్తి పెరుగుతోంది. దీంతో బలోచ్ యువకులు గెరిల్లా పోరాటాలకు సిద్దమవుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్