Saturday, June 13, 2026
Homeసినిమా‘బుజ్జీ... ఇలారా’ లో మహమ్మద్ కయ్యుమ్ గా సునీల్

‘బుజ్జీ… ఇలారా’ లో మహమ్మద్ కయ్యుమ్ గా సునీల్

సునీల్, ధన్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బుజ్జి ఇలా రా’. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ బ్యానర్లపై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, అలాగే ఇటీవల విడుదలైన సీఐ కేశ‌వ్ నాయుడు పాత్ర‌లో న‌టిస్తున్న ధ‌న్‌రాజ్ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేక‌ర్స్ ఈ సినిమాలోని సునీల్ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను  విడుద‌ల చేశారు. ధ‌న్‌రాజు ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నడుస్తుండగా, సునీల్ మహమ్మద్ కయ్యుమ్ పాత్రలో నటిస్తున్నాడు. కయ్యూమ్ పాత్రలో సునీల్ గెటప్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గా కూడా పని చేస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి  క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి భాను, నందు డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular