Sunday, January 19, 2025
HomeTrending Newsమ‌హేష్ బాబుకు క‌రోనా పాజిటివ్

మ‌హేష్ బాబుకు క‌రోనా పాజిటివ్

Mahesh tested positive: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌రోనా బారిన‌ప‌డ్డారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌డం వ‌ల‌న కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్థార‌ణ అయిన‌ట్టుగా మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేశారు. డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు ఇంట్లోనే ఐసోలేష‌న్ అయిన‌ట్టుగా పేర్కొన్నారు. త‌న‌తో కాంటాక్ట్ అయిన వారంతా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని.. అలాగే ఎవ‌రైనా టీకా వేయించుకోక‌పోతే వెంట‌నే వెళ్లి టీకా వేయించుకోవాలని సూచించారు.

టీకా వ‌ల‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌కుండా ఉంటుంద‌ని.. హాస్ప‌ట‌ల్ చికిత్స అవ‌స‌రం ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరారు. త‌న‌కు క‌రోనా సోకింద‌ని సోష‌ల్ మీడియాలో మ‌హేష్ బాబు ప్ర‌క‌టంచినప్ప‌టి నుంచి సినీ ప్ర‌ముఖులు, అభిమానులు, స‌న్నిహితులు ఆయ‌న వెంట‌నే కోలుకోవాల‌ని.. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని కోరుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్