Saturday, March 7, 2026
HomeTrending Newsశ్రీవారిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ దంపతులు

శ్రీవారిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ దంపతులు

తిరుమలలో ఈ రోజు ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులకు తిరుపతి, తిరుమల దేవస్థానం ఛైర్మన్  వై.వి. సుబ్బారెడ్డి, టిటిడి ఈవో డా.జవహర్ రెడ్డి  స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగ నాయకుల మండపం లో వేద పండితులు ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ దంపతులు బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.

చీఫ్ జస్టిస్ వెంట ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర బాబు, చిత్తూరు జిల్లా అదనపు జడ్జి వై.వీర్రాజు, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. ఈ కార్య క్రమంలో టిటిడి అదనపు ఈవో ధర్మా రెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular