Saturday, June 13, 2026
HomeTrending Newsజీవో నంబర్ 1: హైకోర్టు తీర్పుపై స్టే కు సుప్రీం నో

జీవో నంబర్ 1: హైకోర్టు తీర్పుపై స్టే కు సుప్రీం నో

జీవో నంబర్ 1పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.  జాతీయ, రాష్ట్ర, పంచాయతీరాజ్ రోడ్లపై బహిరంగసభలు, రోడ్ షో లు నిర్వహించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1 ను తీసుకు వచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ భట్టు దేవానంద్ నేతృత్వంలోని సింగల్ బెంచ్ తీర్పును ఈనెల 23వరకూ  సస్పెన్షన్ చేస్తూ తీర్పు వెలువరించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున దీనిపై తాము ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని, నేడు విచారించాలేమని సుప్రీం వెల్లడించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసులు విచారించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీం ఈనెల 23కు వాయిదా వేసింది.

Also Read : 23వ తేదీ వరకూ జీవో నం.1 సస్పెన్షన్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular