Friday, November 22, 2024
Homeజాతీయంఖైదీలను విడుదల చేయండి : సుప్రీం

ఖైదీలను విడుదల చేయండి : సుప్రీం

కరోనా నేపధ్యంలో జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల స్థితిగతులపై సుప్రీమ్ కోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో గత ఏడాది తాత్కాలిక పెరోల్ మంజూరు చేసిన ఖైదిలను ఈ ఏడాది కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీలను సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. సుప్రీమ్ కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు లావు నాగేశ్వర రావు, సూర్య కాంత్ లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది.

గత ఏడాది విడుదల చేసిన వారినే కాకుండా కొత్త మార్గ దర్శకాలు రూపొందించి అర్హులైన అందరికి కొంతకాలం పెరోల్ ఇవ్వాలని చెప్పింది. ఇప్పటివరకూ హై పవర్ కమిటీ లు ఏర్పాటు చేయని రాష్ట్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరింది.

కరోనా మహమ్మారి రెండో దశ వేగంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో పెరోల్ గడువును 90 రోజులకు పెంచాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది.          ఏడేళ్ళ పైబడి జైలు శిక్ష పడే అవకాశం వున్న కేసుల మినహా మిగిలిన కేసుల్లో నిందితులను అరెస్టు కూడా చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్