అమరావతి రాజధాని కేసు త్వరగా విచారణ చేపట్టాలన్న ఏపీ సర్కారు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణన లోకి తీసుకుంది. ఈ కేసును మార్చి 28క న ధర్మాసనం విచారించనుంది. అమరావతి రాజధానిగా కొనసాగింపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పలుమార్లు విచారణ వాయిదా పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ మెన్షన్ కింద సుప్రీం ను అభ్యర్ధించింది.
కాగా, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగ రత్నలతో కూడిన ధర్మాసనం ఈ కేసులు విచారిస్తోంది.
Also Read : విభజన చట్టం ప్రకారమే అమరావతి: కేంద్రం

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.