Saturday, June 13, 2026
Homeసినిమాచిరంజీవి ఇంటికి కేంద్ర మంత్రి ఠాకూర్

చిరంజీవి ఇంటికి కేంద్ర మంత్రి ఠాకూర్

కేంద్ర సమాచార-ప్రసార,  క్రీడల శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ నేడు  హైదరాబాద్ లో హీరో చిరంజీవి నివాసానికి వెళ్ళారు.  చిరంజీవి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ భేటీలో మరో హీరో నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.

సినీ రంగంలో అపార అనుభవం ఉన్న చిరంజీవితో సమావేశం కావడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రపంచ సినీ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులపై చర్చించామని, రాబోయే కాలాన్ని కంటెంట్ సెంచరీ గా చేసే అంశంపై తాము మట్లాడుకున్నామని  కేంద్ర మంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

హైదరాబాద్ పర్యటనలో భాగంగా తమ ఇంటికి అనురాగ్ ఠాకూర్ రావడం సంతోషంగా ఉందని, సోదరుడు నాగార్జునతో కలిసి కేంద్రమంత్రితో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించామని చిరంజీవి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular