Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అమరావతి కేసు 19కి వాయిదా

అమరావతి కేసు 19కి వాయిదా

అమరావతి రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ దాఖలైన పిటిషన్ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 19కి వాయిదా వేసింది. నేడు జరిగిన విచారణలో వాడీవాడిగా వాదోపవాదాలు జరిగాయి. వినీత్ శరణ్, దినేష్ మహేశ్వరి లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసును సిట్ కేసుతో జతచేసి విచారించాలన్న దవే వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు:

  • రాజధాని రాకముందే అప్పటి మంత్రులు భూములు కొనుగోలు చేశారు
  • ఆస్తుల కొనుగోలులో అధికారులు, నేతలు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయారు
  • దర్యాప్తును ఆపే అధికారం హైకోర్టుకు లేదు
  • హైకోర్టు అన్ని పరిశీలించకుండానే ఉత్తర్వులు ఇచ్చింది
  • హరియాణా భూములపై ఇచ్చిన తీర్పు ఆధారంగా విచారణ చేపట్టాలి
  • అమరావతికి చెందిన మిగిలిన కేసులతో కలిపి విచారించాలి

సుప్రీం కోర్టు పరిశీలనలు…

  • దుష్యంత్‌ దవే వాదనతో ఏకీభవించని ధర్మాసనం
  • హైకోర్టు అన్ని విషయాలు పరిశీలించాకే తుది ఉత్తర్వులు ఇచ్చింది
  • భూముల కొనుగోలు వ్యవహారంలో హైకోర్టు అన్ని అంశాలు పరిశీలించింది
  • ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఈ కేసుకు వర్తించదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పేముంది
  • రాజధాని అంశం బహిరంగ రహస్యమని హైకోర్టు వ్యాఖ్యలు సహేతుకమే
  • భూములు అమ్మినవాళ్ళు తాము మోసపోయామని చెప్పారా?
  • నష్టం వచ్చినవాళ్ళు కోర్టును ఆశ్రయించాలి కానీ, ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటి?

వాదనలు వినిపించడానికి మరింత సమయం కావాలని దవే చేసిన విజ్ఞప్తి మేరకు కేసు విచారణను సోమవారానికి వాయిదా ధర్మాసనం వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్