Friday, April 19, 2024
HomeTrending Newsసాగర్ లో నిమజ్జనానికి సుప్రీం ఒకే

సాగర్ లో నిమజ్జనానికి సుప్రీం ఒకే

ట్యాంక్ బండ్ లోని  హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ ఏడాదికి అనుమతిస్తున్నామని వచ్చేఏడాది నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని హై కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను కూడా హైకోర్టు కొట్టివేసింది. తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను ఛాలెంజ్ చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీ లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. హైకోర్టు ఇచ్చిన తీరును తాము గౌరవిస్తున్నామని, అయితే ఒకట్రెండు అంశాల్లో మాత్రమే హైకోర్టు తీర్పును అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులున్నాయని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తమ విన్నపాన్ని తెలియజేశారు. కొంత సమయం అవసరమైనందున ఈ ఒక్క ఏడాదికి ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలను సైతం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. తుషార్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ ఒక్క ఏడాదికి మినహాయింపు ఇస్తూ తీర్పు చెప్పింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్