సీఐడీ ఇన్ స్పెక్టర్ బలబద్ర రవికుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ను సస్పెన్షన్ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇటీవల హనుమకొండ రాంనగర్ లోని ఒక మహిళ ఇన్ స్పెక్టర్ ఇంట్లోకి ఆమె భర్త లేని సమయంలో బలభద్ర రవికుమార్ వెళ్లడం, అదే సమయంలో మహిళా ఇన్ స్పెక్టర్ భర్త రాంనగర్ లోని తమ ఇంటికి రావడం, తాను ఇంట్లో లేని సమయంలో బలబద్ర రవికుమార్ అనుమతి లేకుండా తమ ఇంటికి రావడంపై మహిళా ఇన్ స్పెక్టర్ భర్త ఫిర్యాదు చేయడం, సీఐడీ ఇన్ స్పెక్టర్ బలబద్ర రవికుమార్ పై హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే.
సదరు మహిళ ఇన్ స్పెక్టర్ భర్త కూడా పోలీస్ ఇన్ స్పెక్టర్ కావడం, ఆయన మహబూబాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ వివాదంలోని ముగ్గురు వ్యక్తులు పోలీసు శాఖకు చెందిన ఇన్స్పెక్టర్లే కావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసు విచారణ నివేదిక మేరకు ఇక్కడ సీఐడీ విభాగంలో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ బలబద్ర రవికుమార్ ను సస్పెన్షన్ చేస్తూ అదనపు డీజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
మహిళా ఇన్ స్పెక్టర్ ఫిర్యాదు మేరకు ఇదే సుబేదారి పోలీస్ స్టేషన్ లో కొద్ది రోజుల క్రితం ఆమె భర్త రవికుమార్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సీఐడీలో కేడి అధికారిని సస్పెన్షన్ చేసినా…వివాదం సమసినట్టు కనిపించటం లేదని సమాచారం.