Wednesday, June 26, 2024
Homeస్పోర్ట్స్T20 WC: అమెరికాపై విజయంతో సూపర్ 8 కు భారత్

T20 WC: అమెరికాపై విజయంతో సూపర్ 8 కు భారత్

టి 20 వరల్డ్ కప్ లో భారత్ వరుసగా మూడో విజయం నమోదు చేసి సూపర్ 8లో అడుగుపెట్టింది. నేడు జరిగిన మ్యాచ్ లో అమెరికాపై చెమటోడ్చి గెలిచింది. న్యూ యార్క్ లోని నాస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం  వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. అయితే ఈ స్వల్ప లక్ష్యాన్ని  18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

అమెరికా ఆటగాళ్ళు నితీష్ కుమార్ 27; స్టీవెన్ టేలర్ 24, కోరీఅండర్సన్ 15 పరుగులు చేశారు. ఇండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ నాలుగు ఓవర్లలో 9 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు, హార్దిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ సాధించారు.

ఇండియా ఇన్నింగ్స్ రెండో బంతికే విరాట్ కోహ్లీ (డకౌట్) వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 10 వద్ద మరో ఓపెనర్ రోహిత్ శర్మ (3) కూడా వెనుదిరిగాడు. 39 వద్ద రిషభ్ పంత్ (18) కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్ శివందూబే లు మరో వికెట్ పడకుండా నెమ్మదిగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. సోర్య 49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 50; దూబే 35 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 31 రన్స్ సాధించారు.

అర్ష్ దీప్ సింగ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్