Tuesday, March 17, 2026
Homeసినిమాఏప్రిల్ 1న తాప్సీ ‘మిషన్ ఇంపాజిబుల్’

ఏప్రిల్ 1న తాప్సీ ‘మిషన్ ఇంపాజిబుల్’

Taapsee Mission: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అనేక ప్రాజెక్టులను చేపట్టింది. స్టార్స్ తో హై బడ్జెట్ సినిమాలు చేయడమే కాకుండా మీడియం బడ్జెట్ సినిమాలను కూడా తీస్తోంది. మిషన్ ఇంపాజిబుల్ లో తాప్సీ పన్ను కథానాయికగా నటిస్తుండగా, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జే. దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం సంగీత ప్రమోషన్లు ఇటీవలే ప్రారంభమయ్యాయి, ఇటీవలే చిత్ర బృందం ‘ఏద్దాం గాలం` అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది, దీనికి సంగీత ప్రియుల నుండి మంచి స్పందన వచ్చింది. సోమవారం నాడు సినిమా రిలీజ్ డేట్ లి  సంబంధించిన అప్ డేట్ ను అందజేశారు. వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి `మిషన్ ఇంపాజిబుల్’ ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. తిరుపతికి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో ప్రేక్షకులను మైమరిపించే చిత్రంగా రూపొందింది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular