Wednesday, March 18, 2026
Homeస్పోర్ట్స్WI Vs. ZIM: తేజ్ నారాయణ్ చంద్రపాల్ డబుల్ సెంచరీ

WI Vs. ZIM: తేజ్ నారాయణ్ చంద్రపాల్ డబుల్ సెంచరీ

జింబాబ్వేతో ఆ దేశంలో జరుగుతోన్న తొలి టెస్టులో వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ ను 477 పరుగులకు డిక్లేర్ చేసింది. బులావాయో లోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో  ఆడుతోన్న ఈ మ్యాచ్ లో నిన్న 116 పరుగులతో నాటౌట్ గా ఉన్న కెప్టెన్ బ్రాత్ వైట్ 182;  101 తో నాటౌట్ గా ఉన్న తేజ్ నారాయణ్ చంద్రపాల్ తన కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ (207నాటౌట్) నమోదు చేశారు. 143 ఓవర్లలో ఆరు వికెట్లకు 447 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్  చేసింది.

నేడు తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జింబాబ్వే ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. మాకొని-33; చిభభ-9 రన్స్ చేసి ఔట్ కాగా, మరో ఓపెనర్ ఇన్నోసెంట్ కైయా-59 పరుగులతో క్రీజులో ఉన్నారు. కెప్టెన్ క్రేగ్ ఎర్విన్ 13 రన్స్ చేసి బ్రాత్ వైట్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఈ వికెట్ పడగానే రెండో రోజు ఆటను ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular