ఆస్ట్రేలియా తో రేపటి నుంచి మొదలు కానున్న తొలి టెస్టు లో స్టార్ ప్లేయర్ శివనారాయణ్ చంద్రపాల్ కుమారుడు త్యాగ నారాయణ్ కు చోటు కల్పిస్తున్నట్లు వెస్టిండీస్ జట్టు కెప్టెన్ బ్రాత్ వైట్ వెల్లడించారు. ప్రాక్టీస్ మ్యాచ్ లో 119, 56 పరుగులతో రాణించాడని అందుకే తుది జట్టులో అతడు ఆడబోతున్నట్లు ధృవీకరించాడు.

ఆసీస్ పర్యటనలో ఉన్న విండీస్ జట్టు రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 30-డిసెంబర్ 4 వరకూ మొదటి టెస్ట్ పెర్త్ స్టేడియంలో, డిసెంబర్ 8-12 వరకూ రెండో టెస్ట్ అడిలైడ్ లో జరగనుంది.

త్యాగి తండ్రి శివ నారాయణ్ తో తన కెరీర్ ప్రారంభంలో ఇద్దరం కలిసి 18 టెస్టులు ఆడామని, విండీస్ క్రికెట్ కు అతని సేవలు అపురూపమైనవని కొనియాడారు. తండ్రి బాటలోనే త్యాగి కూడా అద్భుత కెరీర్ తో మంచి పేరు సంపాదించుకుంటాదన్న విశ్వాసం ఉందన్నారు.

2014, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో విండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన త్యాగి ఆరు మ్యాచ్ లు ఆడి ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీ లతో పాటు మొత్తం మొత్తం 293 పరుగులతో రాణించాడు. ఈ ఏడాది ఆగష్టు లో బంగ్లాదేశ్ ఏ జట్టుతో ఆడిన వెస్టిండీస్ ఏ జట్టు తరఫున ఆడిన త్యాగి అజేయమైన సెంచరీ తో సత్తా చాటాడు. దీనితో విండీస్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి ప్రస్తుత టెస్ట్ సిరీస్ కు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీనిలో భాగంగా జరిగిన ప్రాక్టీసు మ్యాచ్ లో రాణించి రేపటి మ్యాచ్ ద్వారా తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *