Saturday, January 18, 2025
HomeTrending Newsఆ ఇద్దరూ ఇద్దరే!

ఆ ఇద్దరూ ఇద్దరే!

2014 నవంబరు 13వ తేదీ ప్రత్యేకమే ఆ ఇద్దరికీ….ఆ ఇద్దరంటే ఏ ఇద్దరనేగా…అదేనండీ ప్రపంచంలోనే అతీ ఎత్తయిన వ్యక్తీ, పొట్టీ వ్యక్తీ ఇంగ్లండులోని లండన్లో థామస్ హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డుల దినోత్సవ కార్యక్రమంలో కలుసుకుని ఫోటోలకు పోజిచ్చారు. పొడగరి పేరు సుల్తాన్ కోసెన్. పొట్టి మనిషి పేరు చంద్ర బహదూర్ డాంగి. ఈ సందర్భంగా చంద్ర బహదూర్ మాట్లాడుతూ ఎత్తయిన మనిషిని ప్రత్యక్షంగా చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. తామిద్దరం కలుసుకోవడం మరచిపోలేని సంఘటన అని చెప్పుకున్నాడు.

2014 నాటికి బతికున్న వారిలో అత్యంత ఎత్తయిన వ్యక్తిగా సుల్తాన్ కోసెన్ గిన్నిస్ రికార్డులకెక్కాడు. ఇతను టర్కీకి చెందిన కోసెన్ ఓ రైతు. అతని ఎత్తు 8 అడుగుల 2 అంగుళాలు. ఇంకా అతను ఎత్తు ఎదుగుతూనే ఉన్నట్టు గిన్నిస్ సంస్థ కనుగొంది.

1982 డిసెంబర్ 10వ తేదీన జన్మించిన కోసెన్ ఇంట అతని తోబుట్టువులు కానీ తల్లిదండ్రులుకానీ సగటు పరిమాణంలోనే ఉన్నారు. సాధారణ ఎదుగుదల అనేది కోసెన్ విషయంలోనే జరిగిందని కుటుంబసభ్యులు తెలీపారు. అతని ఎదుగుదలకు ముఖ్య కారణం “పిట్యూటరీ జిగాంటిజం”. మెదడులోని పిట్యూటరీ గ్రంధి నుండి “గ్రోత్ హార్మోన్” విడుదల అవుతుంది.

ఈ విపరీతమైన పరిమాణం కారణంగా, సుల్తాన్ పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయాడు. పైగా తన కుటుంబాన్ని పోషించడానికి అతను ఒక రైతుగా పని చేయడం ప్రారంభించాడు. అలాగే మరికొన్ని చిన్న చిన్న పనులూ చేస్తూ వచ్చాడు. ఎత్తులో ఉన్న ప్రతికూలతల విషయానికొస్తే, అతను సరిపోయే బట్టలు లేదా బూట్లు కొనుక్కోవడం కష్టతరంగా ఉండేది. ఎత్తువల్ల బాస్కెట్ బాల్ ఆడాలనుకుని ఓ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు కానీ మరీ ఎత్తుగా ఉన్నాడని ఎంపికవలేదు.
అయినప్పటికీ, అతనికి బాస్కెట బాల్ క్రీడంటే మహా ఇష్టం.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పుటలకెక్కినప్పుడు అతను మాట్లాడుతూ “నేనీ రికార్డుల పుస్తకానికెక్కుతానని అస్సలు ఊహిఉచలేదని, కాని దాని గురించి కలలు కన్నానని, అయితే తన పేరు ఇందులో నమోదవడం ఎంతో ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉందన్నాడు. 2010 ఆగస్టులో అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం పిట్యూటరీ గ్రంధిని ప్రభావితం చేసే కణితిపై శస్త్రచికిత్స చేసి మరింత ఎత్తు ఎదగకుండా చేసింది. 2013లో అతని పెళ్ళయింది. ఆమె పేరు మెర్వ్ డిబో. అతని కంటే తొమ్మిదేళ్లు చిన్నది. ఆమె ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. వారిద్దరినీ కలిపింది ఓ సన్నిహిత మిత్రుడు. వీరి వివాహానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధితోపాటు వందల మంది హాజరయ్యారు. మరియు స్థానిక ప్రముఖులు ఉన్నారు.

 

ఇక ఈ ఎత్తయిన మనిషిని కలిసిన పొట్టి మనిషి చంద్ర బహదూర్ డాంగీ నేపాల్ దేశస్థుడు. ఇతను 1939 నవంబర్ 30న నేపాల్‌లోని కలిమతిలో జన్మించారు. తన 75 వ ఏట 2015 సెప్టెంబర్ మూడో తేదీన మరణించాడు. అతను న్యుమోనియాతో బాధపడ్డాడు. ఇతని ఎత్తు ఒక్క అడుగు తొమ్మిదిన్నర అంగుళాలు. ఇతను 2012లో అత్యంత పొట్టి వ్యక్తిగా రికార్డు పుటలకెక్కాడు. లండన్లో ఎత్తయిన సుల్తాన్ కోసెన్ ను కలిసిన రోజునే ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళయిన జ్యోతి ఆమ్గేను కూడా కలవడం విశేషం. ఆమె భారతీయురాలు. బాలీవుడ్ నటి. ఆమె ఎత్తు 2011 డిసెంబర్ 16 నాటికి 24.7 అంగుళాలు.

– యామిజాల జగదీశ్

Also Read : భాషా ప్రేమికుల స్ఫూర్తి ప్రదాత 

RELATED ARTICLES

Most Popular

న్యూస్