Saturday, April 20, 2024
Homeసినిమా'పుష్ప2' లో మిల్కీబ్యూటీ ఐటం సాంగ్?

‘పుష్ప2’ లో మిల్కీబ్యూటీ ఐటం సాంగ్?

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన సంచ‌ల‌న చిత్రం పుష్ప‌. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో 100 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేయ‌డంతో పుష్ప 2 మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల పుష్ప 2 మూవీని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. దీంతో పుష్ప 2 ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… పుష్ప మూవీలో స‌మంత ఐటం సాంగ్ చేయ‌డం.. ఆ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేయ‌డం తెలిసిందే. దీంతో పుష్ప 2 లో ఐటం సాంగ్ పై మ‌రింత క్యూరియాసిటీ పెరిగింది. ఇటీవ‌ల పుష్ప 2 లో చంద‌మామ కాజ‌ల్ ఐటం సాంగ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆమధ్య బాలీవుడ్ బ్యూటీ సీనియర్ ఐటమ్ హీరోయిన్ మలైకా అరోరా కనిపించబోతునట్లు టాక్ వినిపించింది.

అయితే… ఇప్పుడు మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఐటం సాంగ్ చేయ‌నున్న‌ట్టుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ సాంగ్ గిరిజన నేపథ్యంలో సాగుతుందని.. పేరుకి ఐటమ్ సాంగ్ అయినా కథలో భాగం అని తెలుస్తోంది. అందుకే, ఈ సాంగ్ లో తమన్నాను తీసుకోవాలనే ఆలోచనలో సుక్కు ఉన్నాడట.  త్వ‌ర‌లోనే పుష్ప 2 రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు. మ‌రి.. ఐటం సాంగ్ పై త్వ‌ర‌లో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్