Saturday, January 18, 2025
Homeసినిమాఈ సినమాకు జాతీయ అవార్డు రావాలి : తమన్నా

ఈ సినమాకు జాతీయ అవార్డు రావాలి : తమన్నా

హీరోయిన్ తమన్నా లేడీ బౌన్సర్‌గా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్  ‘బబ్లీ బౌన్సర్’.  జాతీయ అవార్డు గ్రహీత మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్ నిర్మించాయి. ఈ చిత్ర  ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్‌ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

తమన్నా మాట్లాడుతూ “తెలుగు సినిమా అంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా జర్నీ తెలుగు నుండే సార్ట్ ఆయ్యింది. రాజమౌళి, సుకుమార్ లు అందరూ మన ఇండియన్ రూట్స్ కథలు తీసుకొని చేస్తుంటారు. ఇప్పటికీ మన ఇండియన్ సినిమాను మన ఏమోషన్సే నడిపిస్తాయి. తొలిసారిగా లేడీ బౌన్సర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ స్క్రిప్ట్ నాకు దొరకడం నా అదృష్టం. పమధుర్ భండార్కర్ సర్ తో చేసే అవకాశం వచ్చిందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో హరియాణాకు చెందిన యువతిగా నటించాను. తప్పకుండా ఈ సినిమా నా కేరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది.  బండార్కర్  హీరోయిన్స్ కు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ నెల 23న డిస్నీ+ హాట్‌స్టార్‌ లో విడుదల అవుతున్న ఈ సినిమాను కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చొని హ్యాపీ గా చూడండి” అన్నారు.

Also Read: ఓటీటీలో ‘అఖండ’ స‌రికొత్త రికార్డ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్