Saturday, March 7, 2026
Homeజాతీయంకోవిడ్ పై పోరుకు రజని 50 లక్షల విరాళం

కోవిడ్ పై పోరుకు రజని 50 లక్షల విరాళం

కోవిడ్ పై పోరులో ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సైతం అంటూ ముందుకొస్తున్నారు తమిళ నటులు. సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందజేశారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలుకుసుకుని చెక్కును అందజేశారు.

కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని, కరోనా మహమ్మారిపై పోరులో ప్రభుత్వానికి సహకరించాలని అభిమానులకు రజని పిలుపునిచ్చారు.

మూడు రోజుల క్రితం రజని కుమార్తె సౌందర్య, భర్త విశాగన్, మామ, ఆడబిడ్డలు కలిపి కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. అంతకుముందు నటుడు శివ కుమార్ తన కుమారులు, హీరోలు సూర్య, కార్తిలతో కలిసి కోటి రూపాయలు విరాళం అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular